22ఏ పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయండి : మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి

22ఏ పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయండి : మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: పెండింగ్​లో ఉన్న 22ఏ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. మంగళవారం వల్లభ్​నగర్​లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​లో అప్లికేషన్ల క్లియరెన్స్ ను పరిశీలించారు. ఆన్​లైన్ లో ఉన్న జీవోలతో వెరిఫై చేసి, పెండింగ్ అర్జీలను త్వరగా పరిష్కరించాలన్నారు. లింక్ డాక్యుమెంట్స్ తో వెరిఫికేషన్ చేయాలని, యూఎల్ పీ పెండింగ్​అర్జీలపై ఫోకస్​చేయాలని చెప్పారు. 

ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని క్లియర్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మల్కాజ్​గిరి ఆర్డీవో శ్యాంప్రకాశ్, అల్వాల్ తహసీల్దార్​రాములు తదితరులు పాల్గొన్నారు.