కుత్బుల్లాపూర్లో 30 కిలోల గంజాయి పట్టివేత

కుత్బుల్లాపూర్లో 30 కిలోల గంజాయి పట్టివేత
  •     జీడిమెట్ల, సికింద్రాబాద్​లలో ముగ్గురు అరెస్ట్​

జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు: కుత్బుల్లాపూర్​లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కుత్బుల్లాపూర్​ఎస్​వోటీ, జీడిమెట్ల పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన సురేశ్​లక్ష్మణ్, సురేఖ​అంకుశ్ లుగా గుర్తించారు. వీరు కుత్బుల్లాపూర్​కృష్ణకుంజ్​గార్డెన్​సమీపంలోని ఓ ఇంట్లో ఉంటూ.. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు తేల్చారు. పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి, తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్​చేసి, రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఒడిశాకు చెందిన వ్యక్తి..

నగరానికి గంజాయి తీసుకొచ్చిన ఒడిశాకు చెందిన గగన్ దాస్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్‌‌‌‌టీఎఫ్‌‌‌‌సీ అధికారులు తెలిపారు. ఇతను మంగళవారం 8.3 కిలోల ఎండు గంజాయి ఉన్న బ్యాగుతో సికింద్రాబాద్​రైల్వేస్టేషన్​లో దిగాడన్నారు. ప్లాట్‌‌‌‌ఫామ్​నంబర్‌‌‌‌10 వద్ద మరో వ్యక్తికి సరుకును అప్పగించేందుకు వేచిచూస్తుండగా.. ఎస్‌‌‌‌టీఎఫ్‌‌‌‌సీ బృందం అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు. 

బ్యాగును తనిఖీ చేయగా గంజాయి లభ్యమైందన్నారు. నిందితుడిని, గంజాయిని సికింద్రాబాద్ ఎక్సైజ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ లో అప్పగించినట్లు ఎస్సై మంజు తెలిపారు. ఈ గంజాయిని నగరంలో ఎవరికి అప్పగించాలనుకున్నాడనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.