ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.. విద్యార్థులే హత్య చేశారు: నల్లగొండ ఎస్పీ

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.. విద్యార్థులే హత్య చేశారు: నల్లగొండ ఎస్పీ

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి. పోలీసుల దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటికొచ్చాయి. ప్రిన్సిపాల్ ను హత్య చేసిన ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని వెల్లడైంది. జల్సాలకు అలవాటుపడి డబ్బులకోసం టెన్త్ విద్యార్థులే ఆమెను దారుణంగా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య కేసులు సీరియస్ గా తీసుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ..  కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.. రెండు స్పెషల్ టీమ్ లతో  ఈ కేసు ను ఛేదించారు.  ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ పదో తరగతి విద్యార్థులేనని గుర్తించారు. 

జల్సాలకు అలవాటు పడి ప్రిన్సిపాల్ రూపారెడ్డిని డబ్బుకోసం ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడైంది.నిందితులు అంతా కొండమల్లేపల్లి మండలానికి చెందిన  మైనర్లుగా గుర్తించారు.  ప్రిన్సిపాల్ హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 

ఆగస్టు 11న కొండమల్లేపల్లి లోని నాగార్జున్ పబ్టిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు.  సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు విద్యార్థులు ఆమె హత్య చేసినట్లు గుర్తించారు.  ఈ కేసును ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన మహిళకమిషన్  కఠన చర్యలకు జిల్లా ఎస్పీని ఆదేశించింది.