పిల్లలు కింద కూర్చోవడం బాధగా ఉంది: ఎంపీ వంశీ కృష్ణ భావోద్వేగం

పిల్లలు కింద కూర్చోవడం బాధగా ఉంది: ఎంపీ వంశీ కృష్ణ భావోద్వేగం

విద్యార్థులు కింద కూర్చోవడం తనను కొద్దిగా బాధించిందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. కోటపల్లిలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలను పెద్దపల్లి ఎంపీ  వంశీ కృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయితే, గతంలో ఎంతో అధ్వాన్నంగా ఉన్న ఈ పాఠశాలను, నేడు నిధులు కేటాయించి ఇంత చక్కగా అభివృద్ధి చేసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

నీట్  ఎగ్జామ్ పేపర్ లీక్ అంశంపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, తాము ఢిల్లీలో హక్కుల కోసం పోరాటం చేశామని తెలిపారు. అయితే, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమను అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆయన అన్నారు.

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు.