రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ (డీఆర్డీఓ ఆర్సీఐ) జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 21.
విభాగాల వారీగా ఖాళీలు: రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ) 2, జూనియర్ రీసెర్చ్ ఫెలో 19.
ఎలిజిబిలిటీ: సంబంధిత విభాగంలో మొదటి తరగతిలో ఎం.టెక్/ ఎంఎస్సీ లేదా పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి. మొదటి తరగతిలో బీఈ/ బి.టెక్ తోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. లేదా ఎంఈ/ఎం.టెక్/ ఎంఎస్సీతోపాటు నెట్/ గేట్/ స్లెట్ క్వాలిఫై అయి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 14.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ పరిశీలన, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.inను సందర్శించండి.
►ALSO READ | SIDBIలో ఉద్యోగాలు: పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్.. సీఏ చేసినోళ్లకు ఛాన్స్..
