వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా.. మన దేశ తొలి ఫొటోగ్రాఫర్ గురించి ఆసక్తికర విషయాలు

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా.. మన దేశ తొలి ఫొటోగ్రాఫర్ గురించి ఆసక్తికర విషయాలు

మన దేశంలో తొలి ఫొటోగ్రాఫర్ గా రాజా దీనదయాళ్ కు పేరుంది. ముంబై, ఇండోర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో స్టూడియోలను ఏర్పాటు చేసి భారత దేశ రాజ కుటుంబాల చిత్రాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి దృశ్యాలు, భారతీయ జీవన విధానానికి సంబంధించిన ఫొటోలను అందించిన గొప్ప ఫొటోగ్రాఫర్.  హైదరాబాద్ నగరంలోని చార్మినార్, గోల్కొండ కోట, రాజభవనాలు, ఇతర చారిత్రక ప్రదేశాల చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనం. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా రాజా దీనదయాళ్ గురించి ఫ్యూ లైన్స్.. 

  • భారత దేశ మొట్టమొదటి ఫొటోగ్రాఫర్ గా అంతర్జాతీయ గుర్తింపు 
  • ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన దీన్ దయాళ్ సివిల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు 
  • ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా ఫోటోగ్రఫీపై ఆసక్తి 
  • ఫొటోగ్రఫీలో క్విన్ విక్టోరియా చేత ప్రశంసలు పొందిన ఫొటోగ్రాఫర్ 
  • హైదరాబాద్ నిజాం పాలనలో అధికారిక రాజ్ ఫొటోగ్రాఫర్ గా సేవలు
  • రాజా ముసావిర్ జంగ్ బహాదుర్ బిరుదుతో సత్కరించిన ఆరవ నిజాం 
  •  సాజామిక జీవన విధానానికి రాజ్ దీన దయాల్ ఫొటోస్ నిలువుటద్దం 
  • ఇండోర్, సికింద్రాబాద్, ముంబై ప్రాంతాల్లో సొంత స్టూడియోలు 
  • భారతీయ సంస్కృతికి ప్రతిబింబించిన దీనదయాల్ ఫొటోగ్రఫి