PAK vs ENG  టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధం..  పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ ఇదే!

PAK vs ENG  టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధం..  పూర్తి షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ ఇదే!

PAK vs ENG Test: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌ టూర్ లో భాగంగా 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 19 నుంచి 23 వరకు లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా జరగనుంది. ఆ తర్వాత రెండో టెస్ట్ ఆగస్టు 27 నుంచి 31 వరకు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో, మూడో టెస్ట్ సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. జూన్ 2027లో ది ఓవల్‌లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో టాప్-2లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ గెలవడం అత్యంత కీలకంగా మారింది.

బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. తిరిగి పగ్గాలు చేపట్టిన జో రూట్: 

బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి రెడ్-బాల్ సిరీస్ ఇది. ఈ సిరీస్ కోసం జో రూట్ తిరిగి ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తొలి రెండు టెస్టుల కోసం డ్యాన్ లారెన్స్, మాజీ వైస్ కెప్టెన్ ఆలీ పోప్ జట్టులోకి పునరాగమనం చేయగా, గాయం కారణంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి రెండు టెస్టులకు ప్రకటించారు. 

పాకిస్థాన్‌కు కెప్టెన్ గాయం టెన్షన్.. అఫ్రిది ఔట్:

మరోవైపు పాకిస్థాన్ జట్టు బాబర్ అజామ్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. జూలై 2026లో షాన్ మసూద్ స్థానంలో బాబర్ టెస్ట్ కెప్టెన్సీ చేపట్టినప్పటికీ, వేలి గాయం కారణంగా లీడ్స్‌లో జరిగే తొలి టెస్టుకు అతను ఆడటం అనుమానంగా మారింది. ఇక స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని ఈ పర్యటనకు ఎంపిక చేయకపోవడంతో సీనియర్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్ పాక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారతదేశంలో ఈ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ టెస్ట్ సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) టీవీ ఛానెళ్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు.. అలాగే డిజిటల్ వీక్షకులు సోనీ లివ్ (Sony LIV) యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. తొలి టెస్ట్ మ్యాచ్ ప్రతిరోజు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.


ఇరు జట్లు: 
పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాన్ మసూద్, అబ్దుల్లా షఫీక్, అజాన్ అవాయిస్, ఇమామ్-ఉల్-హక్, ముహమ్మద్ అవాయిస్ జాఫర్, మహమ్మద్ రిజ్వాన్ (కీపర్), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (కీపర్), అమీర్ జమాల్, సల్మాన్ అలీ ఆగా, సౌద్ షకీల్, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్, ఖుర్రం షెహజాద్, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అలీ, ఉబైద్ షా 

ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, డ్యాన్ లారెన్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జేమీ స్మిత్, జోష్ టంగ్