విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా కఠిన చర్యలు : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా కఠిన చర్యలు : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా కఠిన నిర్ణయం తీసుకుంది. స్కూల్, కాలేజీ విద్యా్ర్థులు నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 2026 ఆగస్టు 17వ తేదీతో  సీఎం విజయ్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ రాష్ట్రవ్యాప్తంగా  చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ), లెఫ్ట్ పార్టీల ఆధ్యర్యంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు జరిగిన విషయంతెలిసిందే. ఇలాంటి నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు సర్క్యులర్ జారీ చేసింది.   అదే విధంగా పోలీసులు, పాఠశాల, ఉన్నత విద్యా శాఖలకు సర్క్యులర్ పంపించారు. 

అదేవిధంగా ఇటీవల జరిగిన నిరసనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రాజకీయ పార్టీల ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనటంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. భవిష్యత్తులో ఇలాంటి నిరసనలకు విద్యార్థులను దూరంగా ఉండేలా చూడాలని సంబంధిత శాఖలను ఆదేశించింది.