ఫ్రీగా కొత్త కార్లు.. పెట్రోల్, డ్రైవర్ జీతం కోసం లక్ష రూపాయలు.. ఎమ్మెల్యేల పంట పండింది..!

ఫ్రీగా కొత్త కార్లు.. పెట్రోల్, డ్రైవర్ జీతం కోసం లక్ష రూపాయలు.. ఎమ్మెల్యేల పంట పండింది..!

తమిళనాడు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పంట పండింది. సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంతో ప్రజా ప్రతినిధులు ఖుషీగా ఉన్నారు. నియోజకవర్గాల్లో తిరగటానికి ప్రతి ఎమ్మెల్యేకు కొత్త కార్లు.. ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం విజయ్.

కొత్త కారు ఇస్తే సరిపోదు కదా.. కారు నడపటానికి డ్రైవర్ ఉండాలి.. అందులో పెట్రోల్, డీజిల్ ఉండాలి కదా.. మరి ఈ ఖర్చులు ఎవరు ఇస్తారని.. ముందుగానే ఆలోచించిన సీఎం విజయ్.. కొత్త కారుతోపాటు.. డ్రైవర్ జీతం, పెట్రోల్, డీజిల్ కోసం ప్రతినెలా లక్ష రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీసీకే  పార్టీ ఎమ్మెల్యే జ్యోతిమణి.. తన ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే.. అత్యంత వేగంగా స్పందించిన సీఎం విజయ్.. ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేల కష్టాలపై ఎంతో మానవత్వంతో స్పందించిన సీఎం విజయ్ గారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు..

ప్రజలకు మరింత చేరువయ్యేలా, నియోజకవర్గాల్లో పర్యటించడానికి వీలుగా ఎమ్మెల్యేలకు సరికొత్త కార్లను అందించనున్నట్లు  సీఎం విజయ్ ప్రకటించారు.   ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి క్రమం తప్పకుండా ప్రయాణించాల్సి ఉంటుందని, అందుకే వారికి ఈ రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. అంతకుముందు, వీసీకే (VCK) ఎమ్మెల్యే జోతిమణి.. తగిన లాజిస్టిక్స్ సపోర్ట్ లేకపోతే ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేయలేరని, వారికి ప్రత్యేకంగా కార్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆమె విజ్ఞప్తికి స్పందించిన సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేవలం కార్లను ఇవ్వడంతోనే ప్రభుత్వం ఆగలేదు. కార్ల నిర్వహణ,  డ్రైవర్ జీతం కోసం ప్రతినెలా 75 వేల రూపాయల భత్యాన్ని (Allowance) అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ప్రతి ఎమ్మెల్యే కార్యకారంలో సహాయకుడిని నియమించుకోవడం కోసం అదనంగా నెలకు 25 వేల రూపాయలను ప్రభుత్వం సమకూరుస్తుంది.  నియోజకవర్గ ప్రజలకు మరింత వేగంగా, మెరుగైన సేవలు అందించే దిశగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.