కోహ్లీ సలహాలనే నన్ను పూర్తిగా మార్చేశాయి.. సింధు కామెంట్స్ వైరల్!

కోహ్లీ సలహాలనే నన్ను పూర్తిగా మార్చేశాయి.. సింధు కామెంట్స్ వైరల్!

PV Sindhu: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత షటిల్ క్వీన్ పీవీ సింధు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్న సమయంలో విరాట్ ఇచ్చిన ఒకే ఒక్క చిన్న సలహా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె తెలిపారు. RCB పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సింధు, కోహ్లీని తన సోదరుడిగా అభివర్ణిస్తూ ఆనాటి అనుభవాలను రీకాల్ చేసుకున్నారు.

కష్టసమయంలో ధైర్యాన్ని నింపిన జస్ట్ షో అప్ మంత్రం: 

కెరీర్‌లో ఏదీ కలిసిరాక, తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో విరాట్ కోహ్లీని కలిసినట్లు సింధు వెల్లడించారు. నాకు ఏదీ కలిసి రావడం లేదని తన బాధను వ్యక్తంచేసినప్పుడు విరాట్ సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలేవీ చెప్పకుండా చాలా సింపుల్‌గా ధైర్యం చెప్పారని పేర్కొంది. కోర్టులోకి వెళ్లి నీ సహజసిద్ధమైన గేమ్‌ను ప్రెజర్ లేకుండా ఆడాలని, ఓడిపోవడానికి ఏమీ లేదని, ఇప్పటి వరకు చేసిన కష్టాన్ని నమ్మి ప్రపంచానికి నువ్వేంటో చూపించాలని కోహ్లీ అన్నారని తెలిపింది. ఆ మాటలు తన మనసును బలంగా తాకాయని, ఆ సంభాషణ తన మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చింది. 

ఇప్పటికీ టచ్‌లోనే.. కోహ్లీపై సింధు ప్రశంసలు: 

విరాట్ ఇచ్చిన ఈ సలహా ఇప్పటికీ తన మనసులో నిలిచిపోయిందని పీవీ సింధు వెల్లడించింది. తామిద్దరం ఇప్పటికీ టచ్‌లో ఉంటామని, తాను మ్యాచ్‌లు గెలిచినప్పుడల్లా ఆ సంతోషాన్ని కోహ్లీతో షేర్ చేసుకుంటానని తెలిపింది. మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు కోహ్లీ చూపించే అటిట్యూడ్, ఆయన ఆలోచించే తీరు నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని, అంత సాధించినా ఆయనలోని నిబద్ధతకు హాట్సాఫ్ చెప్పాల్సిందేనని కొనియాడింది. 

►ALSO READ | సింక్‌ఫీల్డ్‌ కప్‌ టోర్నీలో..రెండో స్థానంలోనే గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్ ఎంట్రీ: 

మరోవైపు, న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ (BWF) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు విజయంతో బోణి చేశారు. మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌ను 21–7, 21–11 తేడాతో వరుస సెట్లలో సునాయాసంగా చిత్తు చేసి, తదుపరి రౌండ్‌కు దూసుకెళ్ళింది. విరాట్ కోహ్లీ ఇచ్చిన మోటివేషన్‌తో సరికొత్త జోష్‌లో ఉన్న పీవీ సింధు ఈ టోర్నమెంట్లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.