గుజరాత్‌లోని సూరత్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్న ఫుడ్ తిని ఫుడ్ పాయిజనింగ్ కావడంతో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఒకే కుటుంబానికి చెందిన మరో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు.
వరాచా ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం ఆగస్టు 15న స్థానిక 'శీతల్ రెస్టారెంట్' నుంచి కూరగాయల వంటకం (సబ్జీ) ఆర్డర్ చేసి తిన్నారు. మరుసటి రోజు (ఆగస్టు 16) ఉదయానికి కుటుంబంలోని ఐదుగురికీ వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించాయి. దింతో స్థానిక డాక్టర్‌ను సంప్రదించగా ఆసుపత్రిలో చేరాలని చెప్పారు. అయితే వారు మొదట పట్టించుకోకుండా అందుకు నిరాకరించారు.
ఆగస్టు 17న ఐదేళ్ల చిన్నారి స్పృహ కోల్పోవడంతో వెంటనే సద్విచార్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ పాప మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక తండ్రి కోలుకుని డిశ్చార్జ్ కాగా, తల్లి సహా మరో ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
►ALSO READ | ఏకే-47 కాల్పుల కేసులో ఎస్పీపై వేటు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన బిహార్ సర్కారు
అధికారుల చర్యలు:దీనిపై సమాచారం అందుకున్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC) అధికారులు శీతల్ రెస్టారెంట్ వంటగదిలో తీవ్ర పారిశుధ్య లోపాలు ఉన్నట్లు గుర్తించి, రెస్టారెంట్‌ను సీల్ చేశారు. ఆహార సాంపుల్స్ టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు. గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా ఈ ఘటనపై సుమోటోగా స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఈ ఘటన నేపథ్యంలో సూరత్‌లోని అన్ని రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు (స్పెషల్ డ్రైవ్) ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
#WATCH | Surat, Gujarat: Restaurant shut by Health Department as one child dies, three others hospitalised in suspected food poisoning.
— ANI (@ANI) August 18, 2026
Food Safety Officer, SMC, Sejal Vyas says, “Our team arrived here early this morning in response to a complaint regarding food poisoning. We… pic.twitter.com/Sal9t9tOmu
