మీ భార్యకు మీరు నచ్చుతారా.. లైఫ్ స్టైల్లో ఈ మార్పులు చేసుకోండి.. హీరోలా కనిపిస్తారు!

మీ భార్యకు మీరు నచ్చుతారా..  లైఫ్ స్టైల్లో ఈ మార్పులు చేసుకోండి.. హీరోలా కనిపిస్తారు!

మీ భార్యను గమనిస్తున్నారా..? మీరు ఎలా ఉంటే తనకు నచ్చుతారో ఎప్పుడైనా ఆలోచించారా..? హా నచ్చక ఏం చేస్తాం.. రోజంతా ఆఫీసులో కష్టపడుతున్నది ఫ్యామిలీ కోసమే కదా. అన్నీ త్యాగం చేసి వారికోసమే బతుకుతున్నాం కదా.. అడిగివన్నీ ఇప్పిస్తున్నాం కదా. ఇంకెందుకు నచ్చమూ..? అని అనుకోకండి. భార్యకు నచ్చడం అంటే అవి కాదు.. చాలా చిన్న చిన్న అలవాట్లు.. చిన్న చిన్న సర్దుబాట్లే మిమ్మల్ని మీ భార్యకు బెస్ట్ హబ్బీలా మారుస్తాయి. అవేంటో చూద్దాం.. 

 సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే.. సాక్స్లు, షూస్ విసిరేసి.. ఇంట్లోకి అడుగుపెట్టి, చేతిలో ఉన్న సరంజామాను కుర్చీలో వేసే హస్బెండ్సే ఎక్కువమంది ఉంటారు. అంతా నా వైఫ్ చూసుకుంటుంది లే అనుకునేవాళ్లు కొందరైతే.. ఇవన్నీ వైఫ్ చేయాల్సిన పనులే! అని ఇంకొందరు అనుకుంటారు. 

ఇప్పుడు వర్క్ ఫ్రేమ్ హోం చేసే వాళ్లు ఎక్కువైపోయారు. ఇంటిని ఆగమాగం చేయడం ఇంకా పెరిగిపోయింది. టవల్ చైర్ మీద వేస్తారు. ర్యాక్ లో చెప్పులు పెట్టరు.. వాటర్ బాటిల్ ఓ మూలకు పడి ఉంటుంది. బెడ్ కింద కాఫీ కప్స్ ఉంటాయి. భర్తలు ఇలా చేయడం.. భార్యలకు నచ్చదుగాక నచ్చదు. ఇవేకాదు ఈ లిస్ట్లో ఇంకొన్ని కూడా ఉన్నాయి!
 
గోళ్లు కొరకడం

చిన్నప్పుడు ఎప్పుడో ఊహ తెలియనప్పుడు మొదలయ్యే గోళ్లు కొరికే అలవాటు చాలా మందిలో పెద్దయ్యాక కూడా పోదు. ఏ పనిలేక ఖాళీగా కూర్చున్నప్పుడో, టీవీలో ఇంట్రెస్టింగ్ విదైనా షో చూస్తున్నప్పుడో మెదడుతోపాటు పళ్లకు గోళ్లు కొరికే పని చెప్తుంటారు వీళ్లు. ఎన్నిసార్లు ఎంతమంది గోర్లు కొరకొద్దని చెప్పినా.. ఈ అలవాటు మానుకోరు. ఇలాంటి భర్తలను భార్యలు మెచ్చరు.

హెల్ప్ చేయనివాళ్లు

కొంతమంది మాటలు మస్తు మాట్లాడతారు. ఐ లవ్ యూ' అని లెక్కలేనన్ని సార్లు. చెప్తుంటారు. కానీ, యాక్షన్లో మాత్రం అవేం కనిపించవు.

కిచెన్లో ఒక్కరే పని చేస్తుంటే కొంచెం హెల్ప్ చేద్దాం.. పిల్లల్ని చూసుకుందాం అని కూడా అనుకోరు. చిన్న చిన్న పసులకు భార్య మీదే ఆధారపడుతుంటారు. ఇలాంటి వాళ్లను కూడా భార్య మెచ్చదు. కష్ట సుఖాలతో పాటు పనులు పంచుకునేవాళ్లనే ఇష్టపడుతుంది.

►►ALSO READ | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి : 8 వేల గుండె ఆపరేషన్ల చేసిన డాక్టర్లు చెబుతున్న 5టిప్స్ ఇవే

మెస్సీ కిచెన్

కొంతమంది భర్తలు అప్పుడప్పుడు సడెన్ గా కిచెన్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఏవేవో వంటలు ట్రై చేస్తారు. ఇది వినడానికి అర్రె మస్తు హెల్ప్ చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ, ఎక్కడపడితే అక్కడ వస్తువులు వదిలేసి డర్టీగా మార్చేస్తుంటారు. తర్వాత గంటలు గంటలు క్లీన్ చేయాల్సింది ఎవరు?  అలా వదిలేసిపోతే చేసేది భార్యే. ఇది వంట చేసినదానికంటే ఎక్కువ పని! ఇలా చేయడం ఏ భార్యకూ నచ్చదు.

బ్యాడ్ లిజనర్

కొంతమంది ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరికీ కొత్త కొత్త విషయాలు చెప్తుంటారు. కానీ, వేరేవాళ్లు మాట్లాడటం మొదలు పెట్టగానే.. వామ్మో వీడు బ్యాడ్ లిజనర్! అనుకునేలా ఉంటారు. ఇతరులు చెప్పేది వినే ఓపిక లేని వాళ్లు, ప్రతిసారీ వాళ్లే ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి బ్యాడ్ లిజనర్స్ భార్యలకే కాదు.. ఎవరికీ నచ్చరు.