NTR-Trivikram: ఎన్టీఆర్–త్రివిక్రమ్ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' నా? 'దేవసేనాపతి'నా?.. ఏ టైటిల్ ఫిక్స్ చేశారంటే!

NTR-Trivikram: ఎన్టీఆర్–త్రివిక్రమ్ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' నా? 'దేవసేనాపతి'నా?.. ఏ టైటిల్ ఫిక్స్ చేశారంటే!

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూ. ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ కే సినీ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో ఇప్పుడు తెరకెక్కుతున్న కొత్త చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో మరింత ఆసక్తి పెరిగింది.

అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన అధికారిక ప్రకటన పోస్టర్ లో పౌరాణిక, ఆధ్యాత్మిక ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కథాంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లేటెస్ట్ ఈ మూవీ టైటిల్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో , సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అంతే కాదు ఈ టైటిల్ తో పాటు 'దేవసేనాపతి' అనే మరో పవర్ పుల్ పేరును కూడా చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు టైటిళ్లను కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కథలోని పౌరాణిక అంశాలతో పాటు ఎన్టీఆర్ ఇమేజ్ కు సరిపోయే మాస్ అప్పీల్ ను దృష్టిలో పెట్టుకుని చివరకు ఒక టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని టాక్..

►ALSO READ | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు..ఈడీ విచారణకు నిధి అగర్వాల్

అయితే 'దేవసేనాపతి' అనే టైటల్ పదానికి సేనలకు అధిపతి , దేవతల సైనాధ్యక్షుడు అనే బలమైన పౌరాణిక అర్థం ఉంది.  అందువల్ల ఈ పేరు కథలోని ప్రధాన పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ఎన్టీఆర్ కు ఉన్న యాక్షన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టికుని అంతర్జాతీయ స్థాయి మాస్ ఫీలింగ్ ను అందించేలా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరూ తమ తమ ప్రస్తుత ప్రాజెక్టులతో ఫుల్ బిజీ గా ఉన్నారు. వాటిని పూర్తి చేసిన అనంతరం ఈ భారీ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఇంకా ఈ మూవీ టైటిల్, తారగణం, కథ, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అప్పటివరకు 'గాడ్ ఆఫ్ వార్' లేదా 'దేవసేనాపతి' లో ఏ పేరు ఖరారు చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది..