సింక్‌ఫీల్డ్‌ కప్‌ టోర్నీలో..రెండో స్థానంలోనే గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద.

సింక్‌ఫీల్డ్‌ కప్‌ టోర్నీలో..రెండో స్థానంలోనే  గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద.

సెయింట్‌ లూయిస్‌: ఇండియా గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద.. సింక్‌ఫీల్డ్‌ కప్‌ టోర్నీలో మరో డ్రా నమోదు చేశాడు. మంగళవారం ఫ్యాబియానో కరువాన (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ను ప్రజ్ఞా 56 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్‌ తర్వాత ఇండియన్‌ ప్లేయర్‌ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. నల్ల పావులతో రూయ్‌ లోపెజ్‌ ఓపెనింగ్‌తో ఆడిన  ప్రజ్ఞాకు కరువాన గట్టి పోటీ ఇచ్చాడు. 

అయితే క్వీన్స్‌ లేని మిడిల్‌ గేమ్‌లో ఇద్దరు ప్లేయర్లు క్రమం తప్పుకుండా పావులను మార్చుకున్నారు. చివరకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో డ్రాకు అంగీకరించారు. అనిష్‌ గిరి (నెదర్లాండ్స్‌, 3)తో గేమ్‌ను డ్రా చేసుకున్న వెస్లీ సో (ఉజ్బెకిస్తాన్‌) నాలుగున్నర పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.