బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా షట్లరు ఉన్నతి హుడా, లక్ష్యసేన్‌‌ బోణీ

బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా షట్లరు ఉన్నతి హుడా, లక్ష్యసేన్‌‌ బోణీ

న్యూఢిల్లీ: ఇండియా షట్లరు ఉన్నతి హుడా, లక్ష్యసేన్‌‌.. బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బోణీ చేశారు. మంగళవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో ఉన్నతి 22–20, 21–16తో తెట్‌‌ టార్‌‌ తుజుర్‌‌ (మయన్మార్‌‌)పై గెలవగా, మెన్స్‌‌ సింగిల్స్‌‌లో 14వ సీడ్ లక్ష్యసేన్‌‌ 16–21, 21–8, 21–4తో కొలిన్స్‌‌ వాలెంటైన్‌‌ ఫిలిమోన్‌‌ (ఆస్ట్రియా)పై నెగ్గాడు. 

విమెన్స్‌‌ డబుల్స్‌‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్‌‌ 21–15, 21–12తో లారెన్‌‌ లామ్‌‌–అలిసన్‌‌ క్విన్‌‌ లీ (అమెరికా)పై సంచలన విజయం సాధించారు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో రోహన్‌‌ కపూర్‌‌–గద్దె రుత్విక శివాని 22–20, 19–21, 17–21తో జొనాథన్‌‌ లాయ్‌‌–క్రిస్టల్‌‌ లాయ్‌‌ (కెనడా) చేతిలో, విమెన్స్‌‌ డబుల్స్‌‌లో కవిప్రియ సెల్వం–సిమ్రాన్ సింఘి 7–21, 14–21తో గాబ్రియోలా స్టోయెవా–స్టెఫానీ స్టోయెవా (బల్గేరియా) చేతిలో, అషితా సూర్య–అమృత 21–16, 29–30, 22–24తో ఎమ్రి సోన్మెజ్‌‌–యాస్మిన్‌‌ బెక్టాస్‌‌ (టర్కీ) చేతిలో ఓడారు.