ఆమ్‌స్టెల్‌వీన్ (నెదర్లాండ్స్): ఎఫ్‌ఐహెచ్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్‌లో ఇండియా జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన పూల్–డి రెండో మ్యాచ్‌లో ఇండియా 6–1తో సౌతాఫ్రికాపై గెలిచింది. సునెలితా టొప్పో (11వ ని), నవ్‌నీత్ కౌర్ (17వ ని), సుశీల చాను (25వ ని), దీపిక (38వ ని), లాల్‌రెమ్సియామి (44వ ని), సాక్షి రాణా (45వ ని) ఇండియాకు గోల్స్ అందించారు. సౌతాఫ్రికా తరఫున డి వాల్ కైలా (55వ ని) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించిన ఇండియా గ్రూప్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇండియా ప్లేయర్లు అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గోల్స్ వర్షం కురిపించారు. కీలక టైమ్‌లో సఫారీ ఫార్వర్డ్స్ సర్కిల్‌లోకి దూసుకొచ్చినా.. ఇండియా డిఫెన్స్ బలంగా అడ్డుకుంది. గురువారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఇండియా.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
