విజయానికి 6 వికెట్ల దూరంలో తొలి టెస్ట్‌‌‌‌లో గెలుపు దిశగా ఇండియా

విజయానికి  6 వికెట్ల దూరంలో తొలి టెస్ట్‌‌‌‌లో గెలుపు దిశగా ఇండియా
  •     రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో ఇండియా 193 ఆలౌట్‌‌‌‌
  •     శ్రీలంక లక్ష్యం 372, ప్రస్తుతం 84/4

గాలె: శ్రీలంకతో తొలి టెస్ట్‌‌‌‌లో ఇండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో తక్కువ స్కోరుకు ఆలౌటైనా.. లంక ముందు 372 రన్స్‌‌‌‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన లంక ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 34 ఓవర్లలో 84/4 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌ ధనంజయ్‌‌‌‌ డిసిల్వా (31 బ్యాటింగ్‌‌‌‌), సోనాల్‌‌‌‌ దినుషా (25 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఇండియా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో లంక టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ కుదేలైంది. 

ఏడో ఓవర్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌ (1/11) దెబ్బకు నిషాన్‌‌‌‌ మధుశక (6) ఔట్‌‌‌‌ కాగా, 8వ ఓవర్‌‌‌‌లో సుతార్‌‌‌‌ (2/30).. పసిందు సురియాబండార (0)ను డకౌట్‌‌‌‌ చేశాడు. మూడు బాల్స్‌‌‌‌ తేడాలో రెండు వికెట్లు పడటంతో లంక 14/2తో కష్టాల్లో పడింది. లాహిరు ఉడార (16), కమింద్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (2) కూడా నిరాశపర్చడంతో స్కోరు 47/4గా మారింది. ఈ దశలో డిసిల్వా, దినుషా మెల్లగా ఆడి ఐదో వికెట్‌‌‌‌కు 37 రన్స్‌‌‌‌ జోడించి మరో వికెట్‌‌‌‌ పడకుండా రోజు ముగించారు. ప్రస్తుతం లంక ఇంకా 288 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది. మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌‌‌‌లో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే. 

పంత్‌‌‌‌ ధనాధన్‌‌‌‌..

తొలి సెషన్‌‌‌‌లోనే బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాను కట్టడి చేయడంలో లంక బౌలర్లు సక్సెస్‌‌‌‌ అయ్యారు. పిచ్‌‌‌‌ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును అడ్డుకున్నారు. ఇన్నింగ్స్‌‌‌‌ మూడో బాల్‌‌‌‌కే యశస్వి జైస్వాల్ (0)ను డకౌట్‌‌‌‌ చేసి ఫెర్నాండో (4/31) ఇచ్చిన ఆరంభాన్ని మిగతా బౌలర్లు కూడా సద్వినియోగం చేసుకున్నారు. రెండో ఎండ్‌‌‌‌లో కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (35) దూకుడుగా ఆడాడు. ప్రభాత్‌‌‌‌ జయసూర్య (3/43) బౌలింగ్‌‌‌‌లో లాంగాఫ్‌‌‌‌, సైట్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ మీదుగా రెండు సిక్సర్లు బాదాడు. 1/0 స్కోరు వద్ద వచ్చిన దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ (44) రాహుల్‌‌‌‌కు అండగా నిలిచాడు. ఈ ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంలో ఇన్నింగ్స్‌‌‌‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈ క్రమంలో రాహుల్‌‌‌‌ 25 రన్స్‌‌‌‌ వద్ద డీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తో ఎల్బీ నుంచి బయటపడ్డాడు. చివరకు 15వ ఓవర్‌‌‌‌లో జయసూర్య బౌలింగ్‌‌‌‌లో క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో రెండో వికెట్‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 

కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (8) కూడా జయసూర్య బౌలింగ్‌‌‌‌లో ఎల్బీ అయ్యాడు. దాంతో స్కోరు 81/3గా మారింది. ఈ టైమ్‌‌‌‌లో వచ్చిన రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (66) సూపర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. గ్రౌండ్‌‌‌‌ నలువైపులా భారీ షాట్లు ఆడాడు. అవతలి వైపు బౌండ్రీలతో విరుచుకుపడిన పడిక్కల్‌‌‌‌ నాలుగో వికెట్‌‌‌‌కు 30 రన్స్‌‌‌‌ జోడించి వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి ఇండియా లైనప్‌‌‌‌ తడబడింది. ఓ ఎండ్‌‌‌‌లో పంత్‌‌‌‌ దీటుగా ఆడినా... రెండో ఎండ్‌‌‌‌లో మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (7), జడేజా (9), మానవ్‌‌‌‌ సుతార్‌‌‌‌ (9), కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (5), సిరాజ్‌‌‌‌ (2), ప్రసిధ్‌‌‌‌ కృష్ణ (2) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం కావడంతో ఇండియా తక్కువ స్కోరుకే ఆలౌటైంది. లాహిరు కుమార 2, కేశార నువాంత ఒక్క వికెట్‌‌‌‌ తీశాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 462 ఆలౌట్‌‌‌‌. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 284 ఆలౌట్‌‌‌‌. ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 48.5 ఓవర్లలో 193 ఆలౌట్‌‌‌‌ (పంత్‌‌‌‌ 66, పడిక్కల్‌‌‌‌ 44, రాహుల్‌‌‌‌ 35, ఫెర్నాండో 4/31, జయసూర్య 3/43). శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 34 ఓవర్లలో 84/4 (డిసిల్వా 31*, దినుషా 25*, సుతార్‌‌‌‌ 2/30). 

సిక్సర్ల వీరుడు

టెస్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో వంద సిక్సర్లు కొట్టిన తొలి ఇండియన్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గా రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ అరుదైన రికార్డు సృష్టించాడు. అలాగే  ప్రపంచంలోనే అత్యంత వేగంగా (89 ఇన్నింగ్స్‌‌‌‌) ఈ ఫీట్‌‌‌‌ సాధించిన తొలి ప్లేయర్‌‌‌‌ కూడా అతనే. ఈ క్రమంలో ఆడమ్‌‌‌‌ గిల్‌‌‌‌క్రిస్ట్‌‌‌‌ (130 ఇన్నింగ్స్‌‌‌‌) రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. సిక్సర్ల జాబితాలో బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (138), బ్రెండన్‌‌‌‌ మెకల్లమ్‌‌‌‌ (107), గిల్‌‌‌‌క్రిస్ట్‌‌‌‌ (100) ముందున్నారు. ఇండియా తరఫున పంత్‌‌‌‌ తర్వాత సెహ్వాగ్‌‌‌‌ (90), రోహిత్‌‌‌‌ శర్మ (88), జడేజా (87) ఉన్నారు.