చెన్నై: తమిళనాడులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీవీకే నేత ఆర్. పల్లవి తన బిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సభా కార్యక్రమాల్లో పాల్గొనే టైంలో బిడ్డను సహాయకురాలి సంరక్షణలో ఉంచుతున్నారు.
ఇటీవల పల్లవి తన బిడ్డను సీఎం జోసెఫ్ విజయ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన చిన్నారిని ఆశీర్వదించారు. కాగా, ఎక్కడికి వెళ్లినా బిడ్డను వెంట తీసుకెళ్లడం ద్వారా పల్లవి హడావుడి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. నవజాత శిశువును ఇంట్లో వదిలిపెట్టి ఎలా రావాలని ప్రశ్నించారు.
