పోస్టాఫీసుల్లో గంగాజలం.. రాఖీలకు ప్రత్యేక కవర్లు

పోస్టాఫీసుల్లో గంగాజలం.. రాఖీలకు ప్రత్యేక కవర్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: శ్రావణ మాసం సందర్భంగా తెలంగాణ పోస్టల్ శాఖ కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. పోస్టాఫీసుల్లో గంగాజలాన్ని అమ్ముతున్నారు. గంగోత్రి నుంచి సేకరించిన గంగాజలాన్ని 250 గ్రాముల బాటిళ్లలో అందుబాటులో ఉంచారు. ఒక్కో బాటిల్ ధర రూ.30గా నిర్ణయించారు.

రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు రాఖీలు పంపేందుకు ప్రత్యేక కవర్లను కూడా పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. ఒక్కో రాఖీ కవర్​కు ధర రూ.15గా నిర్ణయించారు. రాఖీలను స్పీడ్ పోస్టులో పంపేవారికి చార్జీలపై 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.