నకిలీ టికెట్లతో జెడ్డా వెళ్లేందుకు యత్నం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ జంట

నకిలీ టికెట్లతో జెడ్డా వెళ్లేందుకు యత్నం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ జంట

గండిపేట, వెలుగు: శంషాబాద్‌‌‌‌ ఎయిర్​పోర్టులో నకిలీ విమాన టికెట్లతో దంపతులు పట్టుబడ్డారు. జెడ్డా వెళ్లేందుకు ఓ దంపతులు శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకున్నారు. ఖతార్‌‌‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ విమానంలో ప్రయాణించేందుకు టికెట్లను అధికారులకు చూపించారు. వాటిని పరిశీలించిన ఇమ్మిగ్రేషన్‌‌‌‌ అధికారులు నకిలీవిగా గుర్తించారు. దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా ఓ ఏజెంట్‌‌‌‌ ద్వారా టికెట్లు పొందినట్లు తెలిసింది. విదేశాలకు పంపిస్తామని చెప్పి నకిలీ టికెట్లు ఇచ్చి దంపతులను ఏజెంట్​ మోసం చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.