న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ఎన్నికల విధానాన్ని, చీఫ్ఎలక్షన్కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు నిబంధనలతో కూడిన ‘సేవ్ అమెరికా యాక్ట్’ను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా భారత్ ఎన్నికల విధానాన్ని ట్రంప్ ఉదహరించారు. భారత్‌లో ప్రతి ఓటరుకు ఫొటో గుర్తింపు కార్డు ఉండటం, ఈవీఎంల ద్వారా పారదర్శకంగా ఎన్నికలు జరగడాన్ని ఆయన కొనియాడారు.
దీంతో ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘డియర్ డొనాల్డ్ ట్రంప్.. దయచేసి జ్ఞానేశ్ కుమార్ను అమెరికా తీసుకెళ్లండి. అక్కడే ఉంచుకోండి. తదుపరి వచ్చే విమానంలో మా ఈవీఎంలను కూడా పంపిస్తాం. మీరు మాపై చూపిన అన్ని రకాల ఒత్తిళ్లు, చులకన మాటలకు బదులుగా మేము మీకు చేయగలిగిన చిన్న సాయం ఇదే.
భారత్ నుంచి ప్రేమతో.." అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాగా, దేశంలో ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై, ముఖ్యంగా ఓటర్ల జాబితాల సవరణ (సర్) వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషన్‌పై పలు ఆరోపణలు చేస్తూ వస్తోంది. అధికార పార్టీ పట్ల సీఈసీ పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ చాలాకాలంగా ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ వ్యంగ్యంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
