FIFA: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర ఓటమి.. వెక్కి వెక్కి ఏడుస్తూ కెరీర్కు గుడ్ బై చెప్పిన నెయ్మార్

FIFA: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర ఓటమి.. వెక్కి వెక్కి ఏడుస్తూ  కెరీర్కు గుడ్ బై చెప్పిన నెయ్మార్

ఫిఫా వరల్డ్ కప్–2026 లో బ్రెజిల్ ప్రయాణం ముగిసింది. నార్వే చేతిలో 2-1 తేడాతో ఓడిపోవడంతో వరల్డ్ కప్ నుంచి ఔట్ అయ్యింది.  మ్యాచ్ లో విజిల్ కేవలం బ్రెజిల్ ప్రపంచ కప్ నుండి బయటకు పంపడమే కాకుండా.. ఆ దేశ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌ను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. జూలై 5, శనివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16లో నార్వే చేతిలో బ్రెజిల్ 2-1 తేడాతో ఓడిపోయింది. దీంతో సీనియర్ ఫార్వర్డ్ మోకాళ్లపై కూర్చొని ప్రార్థించి, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రౌండ్ లో ఈ ఎమోషనల్ దృశ్యాలు వైరల్ గా మారాయి.

నెయ్‌మార్ కన్నీళ్లను ఆపుకోలేక ఇబ్బంది పడుతుండగా, అతని సహచర ఆటగాడు రాఫిన్హా వచ్చి ఓదార్చుతున్న వీడియో వైలర్ గా మారింది.   టోర్నమెంట్ నుంచి బ్రెజిల్ ఎగ్జిట్ అయ్యిందన్న ఆవేదన, ఇక తన చివరి మ్యాచ్ ఇదే అనే ఆందోళనతో చాలాసేపు వెక్కివెక్కి ఏడుస్తూ గ్రౌండ్లోనే కూర్చుని ఉండిపోయాడు.

బ్రెజిల్ పోరాటం వృధా..

నాకౌట్ పోరులో బ్రెజిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. నార్వే అద్భుత ప్రదర్శనతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నార్వే గోల్ కీపర్ ఓర్జాన్ నైలాండ్, స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్‌ల పట్టుదలతో నార్వే  అద్భుత విజయాన్ని సాధించింది.

పోటీ అంతటా నైలాండ్ బ్రెజిల్‌ను నిరాశపరిచాడు. ఫస్ట్ హాఫ్ లో బ్రూనో గిమారేస్ పెనాల్టీని ఆపిన నైలాండ్.. ఆ తర్వాత చేసిన వరుస సేవ్స్ నార్వేను ఆధిక్యంలో ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో హాలాండ్ రెండుసార్లు గోల్ చేసి, స్కాండినేవియన్ జట్టుకు చారిత్రాత్మక విజయంతో  క్వార్టర్-ఫైనల్స్‌ అంచుకు చేర్చాడు.

స్టాపేజ్ టైమ్ చివరి నిమిషాల్లో, బాక్స్ లోపల కాసెమిరోపై ఫౌల్ జరిగిందని తేలడంతో, రిఫరీ వివాదాస్పద పెనాల్టీని ఇవ్వడంతో బ్రెజిల్‌కు చివరి ఆశ చిగురించింది. నెయ్‌మార్ ముందుకు వచ్చి, ప్రశాంతంగా పెనాల్టీని గోల్‌గా మలిచి, తేడాను 2-1కి తగ్గించాడు. అయితే, ఆ గోల్ కేవలం ఓదార్పుగా మాత్రమే మిగిలిపోయింది. చివరి క్షణాల వరకు దృఢంగా నిలబడిన నార్వే.. బ్రెజిల్ ఆశలకు గండికొట్టింది. 

చివరి ప్రపంచ కప్ ఆడుతున్న నెయ్ మార్.. నార్వేతో ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. టోర్నమెంట్ నుంచి టీమ్ ఎగ్జిట్ కావడం తట్టుకోలేక.. భావోద్వేగానికి గురయ్యాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న దృష్యాలను చూసి ఫ్యాన్స్ కన్నీటిపర్యంతం అయ్యాడు. సహచర ఆటగాళ్లు ఓదార్చడానికి ప్రయత్నించగా మరింత దుఖసంద్రంలో మునిగిపోయాడు. కన్నీళ్లతో నిలబడి రాఫిన్హాను కౌగిలించుకున్నాడు. 

ALSO READ : FIFA: చరిత్ర సృష్టించిన మొరాకో.. అజ్జెద్దీన్‌‌‌‌ డబుల్‌‌‌‌ గోల్స్‌తో క్వార్టల్స్లోకి ఎంట్రీ

గాయం కారణంగా నెలల తరబడి ఆటకు దూరంగా ఉన్న నెయ్ మార్.. ఆశతో ప్రారంభమైన టోర్నమెంట్‌ ఇలా అర్థంతరంగా ముగియటంతో దుఖాన్ని ఆపుకోలేకపోయాడు. తన ఫుట్ బాల్ ప్రయాణానికి తుది వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.