FIFA: చరిత్ర సృష్టించిన మొరాకో.. అజ్జెద్దీన్‌‌‌‌ డబుల్‌‌‌‌ గోల్స్‌తో క్వార్టల్స్లోకి ఎంట్రీ

FIFA: చరిత్ర సృష్టించిన మొరాకో.. అజ్జెద్దీన్‌‌‌‌ డబుల్‌‌‌‌ గోల్స్‌తో క్వార్టల్స్లోకి ఎంట్రీ

హూస్టన్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మొరాకో చరిత్ర సృష్టించింది. శనివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌లో మొరాకో 3–0తో కెనడాను చిత్తు చేసింది. దాంతో వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు క్వార్టర్స్‌‌‌‌ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా మొరాకో రికార్డులకెక్కింది. తొలి హాఫ్‌‌‌‌లో ఇరుజట్ల రక్షణ శ్రేణి గట్టిగా పోరాడటంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

మ్యాచ్‌‌‌‌లో ఎక్కవగా ఫౌల్స్‌‌‌‌ అయ్యాయి. రెండు జట్లకు చెరో నాలుగు ఎల్లో కార్డులు లభించాయి. అయితే 50వ నిమిషంలో అష్రాఫ్ హకీమి అందించిన ఫ్రీ కిక్‌‌‌‌ను అజ్జెద్దీన్ ఔనాహి రైట్ ఫుట్ షాట్‌‌‌‌తో  గోల్‌‌‌‌గా మలిచి మొరాకోకు 1–-0  ఆధిక్యం అందించాడు.

ఆ తర్వాత 82వ నిమిషంలో బ్రాహిమ్ డియాజ్ పాస్‌‌‌‌ను అందుకున్న ఔనాహి.. రెండో గోల్ చేసి కెనడా ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాచ్ ఇంజూరీ టైమ్‌‌‌‌ (90+8వ ని)లో సౌఫియాన్ రహిమి మరో గోల్ కొట్టడంతో మొరాకో 3–-0తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.