హైదరాబాద్: భారతీయ యోగా సంస్థాన్ 60వ యోగా దివస్ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, ఇతర అధికారులు 550 మందికి పైగా సాధకులు పాల్గొని యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు.
ఈ కార్యక్రమం చివరలో మంగ ఆధ్వర్యంలో యోగ సాధికలు చేసిన యోగ నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అధ్యక్షులు వందనపు మధు, ప్రధాన కార్యదర్శి పి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో LB నగర్లోని కాస్మోపాలిటన్ కాలనీ మన్సూరాబాద్లో ఈ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి భారతీయ యోగ సంస్థాన్ తెలంగాణ రాష్ట్ర (తూర్పు ) అధ్యక్షులు సుధీర్ కులకర్ణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, సంస్థాన్ కార్యదర్శి సదానంద చారి, కాస్మోపాలిటన్ కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రుద్ర లక్ష్మీనరసింహ పాల్గొన్నారు.
►ALSO READ | ఆసియా క్రీడలకు ముగింపు.. ఇక దోహా 2030 వంతు! బాటన్ అందుకున్న ఖతార్
