గాలె: బౌలింగ్‌లో గుర్నూర్ బ్రార్ (6/68) సూపర్ షో చూపెట్టడంతో.. శ్రీలంక–ఎతో జరిగిన అనధికార రెండో టెస్ట్‌లో ఇండియా–ఎ 10 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. లంక నిర్దేశించిన 33 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 6.2 ఓవర్లలో 36/0 స్కోరు చేసి గెలిచింది.
సాయి సుదర్శన్ (25 నాటౌట్), అమన్ మోఖడే (11 నాటౌట్) ఈజీగా గెలిపించారు. అంతకుముందు 541/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 143.3 ఓవర్లలో 543 రన్స్‌కు ఆలౌటైంది.
సారాన్ష్ జైన్ (70 నాటౌట్) మెరుగ్గా ఆడాడు. కేశర నువాంత 5, సుదీర 3 వికెట్లు తీశారు. తర్వాత లంక రెండో ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 209 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో ఇండియా ముందు 33 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. ఆషెన్ బండార (87) టాప్ స్కోరర్. నువాంత (26), సుదీర (21) ఫర్వాలేదనిపించారు.
