ఇన్స్టాలో పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ను తొలగించండి: మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

ఇన్స్టాలో పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ను తొలగించండి: మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

న్యూఢిల్లీ: పిల్లలపై అసభ్యకర యాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసారం చేస్తున్న ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెయిడ్ అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ ద్వారా చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్సువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఏఎం) ప్రచారం అవుతుండటంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్రంగా మండిపడింది.

ఇలాంటి కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి అన్ని లింకులను వెంటనే తొలగించాలని మెటా సంస్థకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే ఐటీ, పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అలాగే, ఇలాంటి లైంగిక కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే అల్గారిథమిక్ యాంప్లిఫికేషన్ ప్రక్రియను కూడా వెంటనే కేంద్రం స్పష్టం చేసింది. పెయిడ్ యాడ్స్ ద్వారా బాలల లైంగిక వేధింపుల కంటెంట్ ప్రచారమైనప్పుడు, అది థర్డ్ పార్టీ కంటెంట్ అంటూ మెటా సంస్థ బాధ్యత నుంచి తప్పుకోలేదని పేర్కొంది.