బ్యాంక్ ఉద్యోగాల జాతర: IBPS భారీ నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 745 పోస్టులు..

 బ్యాంక్ ఉద్యోగాల జాతర: IBPS భారీ నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 745 పోస్టులు..

దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ 1) పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్స నల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఆర్పీ ఎస్పీఎల్ XVI ప్రక్రియ ద్వారా మొత్తం 745 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2027-28 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నియామకాలు జరగనున్నాయి.

పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్

మొత్తం ఖాళీలు: 745.

విభాగాల వారీగా ఖాళీలు: ఐటీ ఆఫీసర్ (స్కేల్ I) 301. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I) 190, లా ఆఫీసర్ (స్కేల్ 1) 105, రాజ్యభాష అధికారి (స్కేల్ I 89, హెచ్ఎర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I) 60.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బి.టెక్. డిగ్రీ, పీజీ, ఎంబీఏ చేసి ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా..

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.175, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 850.

లాస్ట్ డేట్: జులై 21.

ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: ఆగస్టు,

ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్: సెప్టెంబర్ / అక్టోబర్, 

ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్: నవంబర్,

మెయిన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్: నవంబర్.
 
IBPS ఇంటర్వ్యూ: నవంబర్/డిసెంబర్.

తాత్కాలిక కేటాయింపు: 2027, జనవరి,

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, కామన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.ibps.in సందర్శించండి.

ప్రిలిమ్స్
ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులను ఫైనల్ మెరిట్లో కలపరు. నోటిఫికేషన్లో పేర్కొన్న లా ఆఫీసర్. రాజ్యభాష అధికారి పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు మొత్తం 125 ప్రశ్నలకు గానూ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్  ఆఫీసర్, హెచ్ఎర్/పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

మెయిన్స్: ప్రిలిమినరీ పరీక్షలో మినిమం కటాఫ్ మార్కులు పొందిన వారిని మెయిన్  షార్ట్ లిస్ట్ చేస్తారు. రాజ్యభాష అధికారి పోస్టుకు నిర్వహించే మెయిన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ 45 ప్రశ్నలు. డిస్క్రిప్టివ్ 2 ప్రశ్నలు వస్తాయి. రెండింటికీ కలిపి 60 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలకు 30 నిమిషాల చొప్పున డ్యూరేషన్ ఉంటుంది.

లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఐర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశం నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 60 మార్కులు కేటాయించారు. . డ్యూరేషన్ 45 నిమిషాలు. ప్రిలిమినరీ, మెయిన్ అబ్జెక్టివ్ పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది. ఆఫీసర్, హెచ్ఎర్/పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఇంటర్వ్యూ
మెయిన్స్ కు హాజరైన అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకి 100 మార్కులు కేటాయించారు. మెయిన్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.