ఢిల్లీ జిల్లా, ఫ్యామిలీ కోర్టుల పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 641 పోస్టుల భర్తీకిగాను ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ కంబైన్డ్ ఎగ్జామినేషన్-–2026 ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభం కానుండగా, నవంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 641.
విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్ 267, జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ 201, ప్రాసెస్ సర్వర్106, ప్యూన్ / ఆర్డర్లీ / డాక్ ప్యూన్ 162.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు వాలిడ్ ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్‌పై టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 2026, జూన్ 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 6.
అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 4.
సెలెక్షన్ ప్రాసెస్: ఆబ్జెక్టివ్ పరీక్ష, డిస్క్రిప్టివ్ (ఇంగ్లిష్) పరీక్ష, స్కిల్ టెస్ట్ (అర్హత పరీక్ష మాత్రమే), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ dsssbonline.nic.inను సందర్శించండి.
