కాళేశ్వరం వైఫల్యంపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాళేశ్వరం వైఫల్యంపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

గ్రేటర్ వరంగల్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీరుపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అమలు, నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు బాధ్యత వహిస్తూ ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రాజెక్టును సందర్శించడం ద్వారా ప్రజలు జరిగిన నష్టాన్ని మర్చిపోరన్నారు.

అనంతరం హనుమకొండ హరిత కాకతీయలో నియోజకవర్గ కాంగ్రెస్​ మైనార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబెర్ బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, మైనార్టీ సెల్ చైర్మన్ మీర్జా ఆజిజ్ ఉల్లా బేగ్, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు.