కొత్తగూడ, వెలుగు: పోలీసుల ఎదుటే దంపతులపై దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల సమ్మయ్య, రజితకు బొడ్డు ప్రశాంత్, మహేశ్‌కు మధ్య పొలం వద్ద గెట్టు పంచాయితీ జరుగుతుంది.
సమ్మయ్య పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై రాజ్‌కుమార్ ఇద్దరు సిబ్బంది గ్రామానికి వెళ్లి పరిశీలించమని పంపాడు. పోలీసులు పరిశీలిస్తుండగా, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయపడ్డ రజిత, సమ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన బొడ్డు ప్రశాంత్, మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.
