ఐఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ.. భారీ రేటు పలికే ప్రీమియమ్ ఫోన్ కావడంతో కొందరు బడ్జెట్ కారణంగా ఫోన్ కొనుక్కోవాలనే కోరికను చంపేసుకుంటుంటారు. అయితే.. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర లక్షా 29 వేల 900కి తగ్గింది.
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్, క్యాష్‌బ్యాక్.. ఇవన్నీ అప్లై చేసుకుని లక్షా 49 వేల 900 రూపాయల ఖరీదైన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను 20 వేల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో లక్షా 29 వేల 900 రూపాయలకే పొందొచ్చు. ఈ ఫోన్ మాత్రమే కాదు.. ఐఫోన్ 15 మోడల్పై కూడా 29 వేల దాకా ధర తగ్గుతుంది. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 మోడల్ పై కూడా ఈ ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో 21 వేల వరకూ ధర తగ్గుతుంది.
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో ఇంకా ఏమేం తక్కువకు వస్తున్నాయంటే..
* ఐఫోన్ 17 అసలు ధర-82,900, సేల్ ధర: 70,900
* ఐఫోన్ 17 ప్రో అసలు ధర లక్షా 34 వేల 900, సేల్ ధర: లక్షా 12 వేల 900
* శామ్ సంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ-అసలు ధర రూ.59,999, సేల్ ధర: రూ. 47 వేల 999
* మోటో జీ37 పవర్- అసలు ధర: రూ.21 వేల 999, సేల్ ధర: రూ.15 వేల 999
* రెడ్ మీ ప్యాడ్ 2- అసలు ధర: రూ.16 వేల 999, సేల్ ధర: రూ.15 వేల 999
* Asus Vivobook 15 (Intel Core i5 13th Gen): అసలు ధర-రూ.50 వేల 990, సేల్ ధర: రూ.42 వేల 990
* Samsung Galaxy Tab A11+: అసలు ధర-రూ.47 వేల 999, సేల్ ధర: రూ.22 వేల 999
