లక్ష పెట్టుబడి పెట్టండని చెప్పి నిండా ముంచినోడు దొరికాడు !

లక్ష పెట్టుబడి పెట్టండని చెప్పి నిండా ముంచినోడు దొరికాడు !

హైదరాబాద్: లక్ష పెట్టుబడి పెడితే భారీగా వడ్డీ ముట్టజెప్తానన్నాడు. కంపెనీలో వాటాలు ఇస్తామన్నాడు. హైదరాబాద్ సిటీలో ఒకటికి రెండు ఆఫీస్లు తెరిచాడు. వేల మందిని నమ్మించాడు. 4 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టించాడు. "షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్", "కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థ" పేరుతో వేల మందిని నిండా ముంచేశాడు.

బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే 1500 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత మోసానికి పాల్పడిన.. నానావత్ భూపాల్ నాయక్ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఈ రెండు కంపెనీల పేరుతో నిందితుడు దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

►ALSO READ | అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. రోజూ రూ.8 లక్షలు దారి మళ్లాయా? సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!
 
హైదరాబాద్ సిటీలోని కొండాపూర్‌లో షేర్స్ బజార్ సంస్థను భూపాల్ ప్రారంభించాడు. సెబీ రిజిస్ట్రేషన్ ఉందంటూ పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్ష రూపాయల పెట్టుబడికి నెలకు 4 శాతం రాబడి ఇస్తామని హామీ ఇచ్చారు. 150 మందికి పైగా ఉద్యోగులతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ ప్రచారంతో పెట్టుబడిదారులను సదరు సంస్థ ఆకర్షించింది. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన బాధితులు ఇదంతా పెద్ద స్కాం అని.. తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు.