కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం (జులై 05) మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. భీమారం మండల కేంద్రంలో పలు నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి భూమిపూజ చేశారు.
గ్రామాల అభివృద్ధికి నిధులను కేటాయించి, పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ALSO READ : బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుల్లో నీటిని నిల్వచేస్తే బ్యారేజీలే కొట్టుకుపోతాయి: మంత్రి ఉత్తమ్
అనంతరం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్:
- చాలా రోజుల నుంచి ఇక్కడ సీసీ రోడ్లు కావాలని అన్నారు
- సుమారు 143 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగింది
- ఇంకా ఎక్కువ ఇండ్లు కావాలని కోరారు
- 10 సంవత్సరాలు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తాం అని బీఆర్ఎస్మోసం చేసింది
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది
- అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి సన్న బియ్యం ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము..
