నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 5) ఉదయం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి దగ్గర విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై అక్షయ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను నల్గొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
