FiFA WORLD CUP: గట్టెక్కిన అర్జెంటీనా.. కేప్‌‌‌‌ వెర్డేపై గెలుపుతో ప్రిక్వార్టర్స్‎లోకి మెస్సీ టీమ్ ఎంట్రీ

FiFA WORLD CUP: గట్టెక్కిన అర్జెంటీనా.. కేప్‌‌‌‌ వెర్డేపై గెలుపుతో ప్రిక్వార్టర్స్‎లోకి మెస్సీ టీమ్ ఎంట్రీ

మయామి గార్డెన్స్: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అర్జెంటీనా తృటిలో గట్టెక్కింది. శనివారం జరిగిన రౌండ్‌‌‌‌–32 మ్యాచ్‌‌‌‌లో 3–2 తేడాతో కేప్‌‌‌‌ వెర్డేపై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. మ్యాచ్‌‌‌‌ 29వ నిమిషంలో మెస్సీ అద్భుతమైన గోల్‌‌‌‌తో అర్జెంటీనాకు 1–0 ఆధిక్యం అందించాడు. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చరిత్రలో అతనికిది 20వ గోల్‌‌‌‌ కావడం విశేషం. అలాగే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌‌‌‌ల్లో గోల్స్‌‌‌‌ సాధించిన ఏకైక ప్లేయర్‌‌‌‌గా మెస్సీ రికార్డులకెక్కాడు. 

ఈ చివరి ఎనిమిది మ్యాచ్‌‌‌‌ల్లో మెస్సీ ఏకంగా 12 గోల్స్‌‌‌‌ చేయడం విశేషం. ప్రస్తుత టోర్నీలో ఏడు గోల్స్‌‌‌‌ చేసిన మెస్సీ ‘గోల్డెన్‌‌‌‌ బూట్‌‌‌‌’ రేసులో టాప్‌‌‌‌లో ఉన్నాడు. ఎంబాపె ఆరు గోల్స్‌‌‌‌తో రెండో ప్లేస్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. ఇంతవరకు మెస్సీ తన కెరీర్‌‌‌‌లో గోల్డెన్‌‌‌‌ బూట్‌‌‌‌ అవార్డును అందుకోలేదు. 2022 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో 7 గోల్స్‌‌‌‌ చేసినా.. ఎంబాపె 8 గోల్స్‌‌‌‌తో అవార్డును కైవసం చేసుకున్నాడు. 

సెకండాఫ్‌‌‌‌లో అటాకింగ్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడిన డెరోయ్ డువార్టే 52వ నిమిషంలో గోల్‌‌‌‌ కొట్టి కేప్‌‌‌‌ వెర్డేను రేసులోకి తెచ్చాడు. ఇక్కడి నుంచి ఇరుజట్లు గోల్స్‌‌‌‌ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ క్రమంలో లిసాండ్రో మార్టినేజ్‌‌‌‌ (92వ ని) గోల్‌‌‌‌ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 2–1కి పెరిగింది. 103వ నిమిషంలో సిడ్నీ లోపెస్‌‌‌‌ కాబ్రాల్‌‌‌‌.. అర్జెంటీనా గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ ఎమిలియానో మార్టినెజ్‌‌‌‌ను బోల్తా కొట్టించి గోల్‌‌‌‌ కొట్టాడు. 

దాంతో స్కోరు 2–2తో సమం కావడంతో మ్యాచ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌కు దారి తీసింది. 111వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌ రొమెరో హెడర్‌‌‌‌తో కొట్టిన బాల్‌‌‌‌.. కేప్‌‌‌‌ వెర్డే డిఫెండర్‌‌‌‌ దినే బోర్గ్స్‌‌‌‌ శరీరానికి తగిలి గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లోకి వెళ్లింది. ఫలితంగా అర్జెంటీనాకు ‘ఓన్‌‌‌‌ గోల్‌‌‌‌’ రూపంలో 3–2 ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్‌‌‌‌లో కేప్‌‌‌‌ వెర్డే 40 ఏళ్ల గోల్‌‌‌‌ కపీర్‌‌‌‌ వోజిన్హా.. మెస్సీ కొట్టిన ఐదు ప్రమాదకరమైన షాట్లతో పాటు మొత్తం పది గోల్స్‌‌‌‌ను అడ్డుకున్నాడు.