హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్ ఖాజాగూడలో తొలి అండర్‌గ్రౌండ్ సూపర్‌కార్ షో రెడ్‌లైన్ 2026 జరిగింది. ఈ ప్రదర్శనలో రూ.120 కోట్లకు పైగా విలువైన 60 సూపర్‌కార్లు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం బైక్‌లను ప్రదర్శించారు. వీటిలో లంబోర్గిని, ఫెరారీ, మెక్‌లారెన్, పోర్షే, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ, రాల్స్రాయిస్ మసెరాటి, జాగ్వార్, బీఎండబ్ల్యూ ఎం సిరీస్, మెర్సిడెస్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కొందరు టీనేజర్లు ఈ కార్యక్రమాన్ని ఒక సెల్ఫ్‌స్టడీ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టుగా రూపకల్పన చేశారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్పాన్సర్‌షిప్ సమీకరణ, ఆపరేషన్స్, కంటెంట్ క్రియేషన్ వంటి కీలక అంశాలను ప్రాక్టికల్‌గా నేర్చుకునేందుకు ఈ వేదికను ఉపయోగించుకున్నారు.
