Vastu tips : ప్రధాన ద్వారం ఎదురుగా రోడ్డు ఉంటే నష్టాలొస్తాయా.. తూర్పు.. ఉత్తర దిక్కుల్లో ఎటువైపు మెయిన్ డోర్ ఉండాలి..!

Vastu tips : ప్రధాన ద్వారం ఎదురుగా రోడ్డు ఉంటే నష్టాలొస్తాయా.. తూర్పు.. ఉత్తర దిక్కుల్లో ఎటువైపు మెయిన్ డోర్ ఉండాలి..!

ఇల్లు.. ఇంటి స్థలం వాస్తు ప్రకారమే ఉండాలి.  ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ప్రధాన ద్వారం ఉత్తర దిక్కులో ఉండి.. దాని ఎదురుగా రోడ్డు ఉంటే వీధి పోటు ఉంటుందా..  తూర్పు.. ఉత్తరం దిక్కుల్లో రోడ్డు ఉంటే ప్రధాన ద్వారం ఎటు ఉంటే మంచిది.. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న:  రెండు రోడ్లతో వీధి దోషం ఉంటుందా? ఇంటి ఉత్తర ప్రధాన ద్వారం ఎదురుగా రోడ్డు ఉంది. అలాగే ఆ రోడ్డును ఆనుకుని, తూర్పు వైపు మరో రోడ్డు ఉంది? రెండువైపులా రోడ్డు ఉండొచ్చా? వీధిపోటు వంటి దోషాలు ఏమైనా ఉంటాయా?

జవాబు:  ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యం దిక్కుల్లో ప్రధాన ద్వారం ఎదురుగా రోడ్లు ఉన్నా పర్వాలేదు. ఈ దిక్కులో వీధిపోటు వల్ల దోషాలేం ఉండవు, అయితే, ఇంటి నిర్మాణం, ఇతర దిక్కుల్ని పరిశీలిస్తేనే సరైన సలహా చెప్పే వీలుంటుంది.

ప్రశ్న:  మా ఇంటికి ఉత్తర దిక్కు మెయిన్ రోడ్, తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంది. మెయిన్ గేట్ ఉత్తరంవైపు వచ్చేలా ప్రహరీ గోడ కట్టుకోవచ్చా?

జవాబు:  ఉత్తరం వైపు వచ్చేలా ప్రధాన ద్వారం కట్టుకోవచ్చు. తూర్పువైపు కూడా కట్టుకోవచ్చు. అలా కట్టుకున్నా చాలా మంచిది. ఒకవైపు పెద్ద గేట్, రెండోవైపు చిన్న గేట్ కూడా పెట్టుకోవచ్చు. మీ వీలునుబట్టి రెండు దిక్కుల్లో ఎటువైపు ఏర్పాటు చేసుకున్నా మంచిదే.