ఫీజు బకాయిలు రూ.8 వేల కోట్లు చెల్లించాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

ఫీజు బకాయిలు  రూ.8 వేల కోట్లు చెల్లించాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

మెహిదీపట్నం, వెలుగు: మూడేండ్లుగా పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పల్లగొర్ల  మోదీరాందేవ్ యాదవ్ , బీసీ యువజన సంఘం అధ్యకుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. బీసీ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై అఖిలపక్ష నాయకులు పోరాడాలని కోరారు.