పెద్దపల్లి జోన్‌‌‌‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్పులు

పెద్దపల్లి జోన్‌‌‌‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్పులు

గోదావరిఖని, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్‌‌‌‌లో గోదావరిఖని వన్‌‌‌‌ టౌన్, రామగుండం, బసంత్‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం గోదావరిఖని టూ టౌన్ పరిధిలో ఉన్న జనగామ గ్రామం, సమ్మక్క–సారలమ్మ గద్దెలు, గోదావరి వంతెన, గంగానగర్ ప్రాంతాలను వన్‌‌‌‌ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. ప్రస్తుతం పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఉన్న బసంత్‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్‌‌‌‌ను గోదావరిఖని సబ్​డివిజన్​లోని రామగుండం సర్కిల్ పరిధిలోకి చేర్చారు.

ఫలితంగా బసంత్​నగర్ ​ఫ్యాక్టరీ, 17 గ్రామాలు రామగుండం సర్కిల్​లోకి చేరాయి. అలాగే ప్రస్తుతం అంతర్గాం స్టేషన్ పరిధిలో ఉన్న లింగాపూర్, కుందన్‌‌‌‌పల్లి గ్రామాలను రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చుతూ గెజిట్ ​విడులైంది. ఈ సందర్భంగా రామగుండం పోలీస్​ కమిషనర్ ​అంబర్ ​కిశోర్ ఝా మాట్లాడుతూ ఈ మార్పుల ద్వారా ప్రజలకు సమర్థవంతమైన, సులభతరమైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్ఠంగా అమలు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు