ఈవీవీ బ్యానర్‌‌ లో కొత్త చిత్రం షురూ

ఈవీవీ బ్యానర్‌‌ లో కొత్త చిత్రం షురూ

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ.ఈవీవీ సినిమా బ్యానర్‌‌‌‌పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 

తాజాగా ఈ బ్యానర్‌‌‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 10గా ఆయన  పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్  నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈవీవీ సినిమా,  ఎన్‌‌వీఆర్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై ఆర్యన్ రాజేష్, ఎన్.వి. కృష్ణారెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని  ప్రారంభించారు.  ఈ సినిమాలో ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తుండగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. అరుణ్ బాలాజీ, శ్రీ రంజని కలిసి దర్శకత్వం వహిస్తున్నారు.  నిజ జీవిత కథ ఆధారంగా  ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే  రెగ్యులర్  షూటింగ్ స్టార్ట్ చేస్తామని, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.