రెండేండ్ల కింద పెద్దపల్లిలో అదృశ్యం.. నెల్లూరులో తల్లీకొడుకు గుర్తింపు

 రెండేండ్ల కింద పెద్దపల్లిలో అదృశ్యం.. నెల్లూరులో తల్లీకొడుకు గుర్తింపు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన చిట్టి సంధ్య, ఆమె కొడుకు సాత్విక్​ 2024 మార్చి 24న తప్పిపోగా, రెండేండ్ల తరువాత వారిని పోలీసులు గుర్తించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. తల్లీకొడుకు కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు రామగుండం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్సై సంధ్యారాణి ఆధ్వర్యంలో సెల్​ సిగ్నల్​ ఆధారంగా తల్లీకొడుకు నెల్లూరులోని ఓ దర్గాలో ఉన్నట్లు గుర్తించారు. వారిని తీసుకువచ్చి ఎన్టీపీసీలోని రామగుండం సర్కిల్​ ఆఫీస్​లో కుటుంబసభ్యులకు అప్పగించారు.