భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో గర్భగుడిలో మూలవరులకు అర్చన నిర్వహించారు. ప్రాకార మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం నిర్వహించగా, భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు.
ఉగాది పండుగ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన భద్రగిరి శతకం ఆడియో రికార్డును సీతారామచంద్రస్వామికి గరికపాటి రామమూర్తి సమర్పించారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలం అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో కేవలం పడమర మెట్ల వైపు నుంచే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించారు.
