ఏటీసీలకు మణుగూరు రోల్ మోడల్: మంత్రి వివేక్ వెంకటస్వామి

 ఏటీసీలకు మణుగూరు రోల్ మోడల్: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     ఓల్డ్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ విడి భాగాలతో ఈవీ వెహికల్స్ తయారు చేసిన స్టూడెంట్లకు 
  • మంత్రి వివేక్ అభినందన    టాటా సహకారంతో
  • రూ.4 వేల కోట్లతో ఏటీసీలు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి
  •     మణుగూరులోని ఐటీఐ, ఏటీసీ విద్యార్థుల ఆవిష్కరణలు పరిశీలన

భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: మారుమూల ప్రాంతమైన మణుగూరు ఐటీఐ, ఏటీసీ విద్యార్థులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ తయారు చేసి రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌గా నిలిచారని మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందించారు. విద్యార్థుల ఆవిష్కరణలు కేవలం ప్రాజెక్టులకే పరిమితం కాకుండా.. వివిధ పరిశ్రమల సహకారంతో వారి ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఐటీఐ, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను ఆయన పరిశీలించారు. పాత వాహనాల విడిభాగాలు సేకరించి వాటితో రూపొందించిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి, వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. టాటా సంస్థ రూ.4 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోని 119 అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నదని ఆయన తెలిపారు. పాత ఐటీఐల్లో కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులతో పాటు పరిశ్రమలకు అవసరమమైన ఆధునిక సాంకేతిక కోర్సులను కూడా ఏటీసీల్లో ప్రవేశ పెడ్తున్నామని చెప్పారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు టాటా సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, దాదాపు వంద మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగాలు ఇచ్చేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. 

ఏటీసీల్లో ఇన్నోవేషన్ పోటీలు.. 

రాష్ట్రంలోని 119 ఏటీసీల్లోని విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు నిర్వహించనున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అత్యుత్తమ ఆవిష్కరణలు చేసే విద్యార్థులకు అవార్డులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల యువత, యువ రైతుల కోసం వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెక్నికల్‌‌‌‌‌‌‌‌, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, టామ్‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందన్నారు. చెన్నూరులో స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నామని, మణుగూరులో ఐటీసీతో కలిసి స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్‌‌‌‌‌‌‌‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ సెంటర్స్ జాయింట్ డైరెక్టర్ నగేశ్, టామ్‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌ ఈవో గౌస్ పాషా, రతన్ టాటా ఆర్డీడీ కోటేశ్వరరావు, ఏటీసీ కాలేజీ ప్రిన్సిపాల్ సారంగపాణి, తహసీల్దార్ నరేషన్, విజయ భాస్కర్ పాల్గొన్నారు.