జగిత్యాలలోని లాడ్జిలో భార్య కుర్రాడితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త !

జగిత్యాలలోని లాడ్జిలో భార్య కుర్రాడితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త !

జగిత్యాల: జగిత్యాలలోని ఒక లాడ్జిలో వివాహితతో యువకుడు దొరికిపోయిన ఘటన కలకలం రేపింది. సదరు వివాహిత భర్త రెడ్‌హ్యాండెడ్‌గా ఇద్దరినీ పట్టుకున్నాడు. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జిలో ఈ ఘటన జరిగింది. వివాహితతో ఓ యువకుడు ఉన్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో లాడ్జి వద్దకు చేరుకున్న భర్త పోలీసుల సహకారంతో ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. జగిత్యాల రూరల్ మండలం నాగునూరు గ్రామానికి చెందిన వారిగా బాధిత భర్త తెలిపాడు.

పోలీసులు, ఆమె భర్త ఎంత డోర్ కొట్టినా వివాహిత తలుపు తీయలేదు. భయంతో బాత్ రూంలోకి వెళ్లి లాక్ చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఎంత పిలిచినా ఆమె బయటకు రాకపోవడం గమనార్హం. చివరకు ఆ మహిళతో పాటు ఉన్న యువకుడు బాత్రూం దగ్గరకు వెళ్లి.. ‘‘ఏం కాదు.. బయటకు రా’’ అని చెప్పాకే వివాహిత బయటకు వచ్చింది. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో కలకలం రేపింది. వివాహేతర సంబంధాలు, వ్యభిచార ముఠాలు పట్టుబడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న వాని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి పోలీసులు భాగ్యనగర్ కాలనీలోనీ అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లో ఉన్న సాయి ప్యారడైజ్ ఓయో హోటల్, వైశాలి కాటేజ్ ఓయో హోటల్లో గత అర్ధరాత్రి  దాడులు నిర్వహించినట్లు బాలానగర్ ఏసిపి నరేష్ రెడ్డి వెల్లడించారు. ఈ దాడుల్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు నిర్వాహకులు, ఐదుగురు కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు బాధితులను పోలీసులు రక్షించారు.

బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ హోటల్స్లో జరిగే ఈ కార్యకలాపాలు అన్నీ కూడా నిర్వాహకులకు తెలుసని తమ విచారణలో వెల్లడయిందన్నారు. దీనిలో ముఖ్యంగా ఆమని, రాజేష్ ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తూ మధ్యవర్తుల సహాయంతో ఈ వ్యభిచార కార్యకలాపాలు చేపడుతున్నారని అన్నారు. వారిపై  పిటా (PITA) చట్టం కింద రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే నిర్వాహకులు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.