జులై 10th వస్తున్నాం.. మన వాడు కొడుతున్నాడు: లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున భావోద్వేగం

జులై 10th వస్తున్నాం.. మన వాడు కొడుతున్నాడు: లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున భావోద్వేగం

అక్కినేని అఖిల్ సినిమా ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో వేల మంది అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ‘లెనిన్’ సినిమా కచ్చితంగా హిట్టు బొమ్మ అనే తరహాలో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘జులై 10th వస్తున్నాం.. మన వాడు కొడుతున్నాడు’’ అని వేల మంది అభిమానుల సమక్షంలో చెప్పారు.

అఖిల్ ఈసారి హిట్టు కొట్టడం పక్కా అనే రీతిలో అక్కినేని నాగార్జున ఫుల్ కాన్ఫిడెంట్గా మాట్లాడటంతో అఖిల్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమాపై నిర్మాత నాగవంశీకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే.. ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడని నాగార్జున చెప్పాడు. అఖిల్ కూడా.. ఈసారి తాను ఎక్కువ మాట్లాడనని.. సినిమానే మాట్లాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

►ALSO READ | ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై తమిళనాడులో వివాదం.. సినిమా ఆపకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక

‘అఖిల్’కు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం అతనితో పాటు నాగార్జున కూడా యుద్ధమే చేస్తున్నాడు. ‘లెనిన్’ సినిమా తమ ఆకలిని తీర్చుతుందని ఈ తండ్రీకొడుకులు నమ్మకంగా ఉన్నారు. జులై 10న ‘లెనిన్’ సినిమా విడుదల కానుంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్‌‌‌‌లో మురళీ కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం తమన్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.