ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై తమిళనాడులో వివాదం.. సినిమా ఆపకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై తమిళనాడులో వివాదం.. సినిమా ఆపకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై వివాదం నెలకొంది. తమిళనాడుకు చెందిన NTK పార్టీ అధినేత సీమాన్ ఈ సినిమాను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు. తమిళ ప్రజల ఆరాధ్య దైవం మురుగన్ను ఉత్తర భారత దైవంగా చూపడం సరికాదని.. కార్తికేయ స్వామి తమిళనాడు రాష్ట్ర ఆరాధ్య దైవమని.. తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా పురాణాలను వక్రీకరించి ఇష్టారీతిన సినిమాలు తీస్తే ఊరుకునేదే లేదని సెంథమిళన్ సీమాన్ హెచ్చరించారు. ఈ సినిమాను ఆపకపోతే ఆందోళనలు చేస్తామని సీమాన్ వార్నింగ్ ఇచ్చారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యాన్ని కథగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ గురించి చెబుతూ.. ఉత్తరాదిలో పుట్టి దక్షిణాదిలో ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న దేవుడిగా సుబ్రహ్మణ్య స్వామి గురించి వివరించారు.

ఉత్తరాదిలో పుట్టిన దైవంగా సుబ్రహ్మణ్య స్వామిని గురించి చెప్పడంపై తమిళనాడులోని భక్తులు భగ్గుమన్నారు. ఆయన తమిళుల దైవమని.. తమిళనాడుకు చెందిన దైవం అని వాదిస్తున్నారు. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధిస్తారో తెలిసిందే.

►ALSO READ | 61 ఏళ్ల వయసులో.. ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులుగా ఆయన మాజీ భార్య, పిల్లలు !

మురుగన్, కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి.. ఇలా పలు పేర్లతో ఈ శివపార్వతుల తనయుడిని పూజిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం మురుగన్ శివపార్వతుల చిన్న కుమారుడు. వినాయకుని సోదరుడు. తమిళనాడులో మురుగన్ను విపరీతంగా ఆరాధిస్తారు. ఆయనకు దేవసేన (దైవనై), వల్లి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.

సుబ్రహ్మణ్య స్వామి జన్మ స్థలంపై హిందూ పురాణాల్లో అనేక కథనాలు ఉన్నాయి. ఆయన శివుని మూడవ కంటి నుంచి వెలువడిన నిప్పురవ్వల నుంచి గంగానదిలో జన్మించి, తమిళనాడులోనితిరుచెందూర్ పవిత్ర కొండలపై పెరిగాడని నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో భక్తుల నమ్మకం ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పట్టణమైన రుద్రప్రయాగ్‌ను కార్తికేయుడు జన్మించిన ఖచ్చితమైన భూలోక ప్రదేశంగా చెబుతుంటారు.