సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర నేషనల్ హైవే-65 రోడ్డుపై కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఒక కారు, ఒక ట్రాక్టర్, 3 బైక్లను అతివేగంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, ట్రాక్టర్ నుజ్జునుజ్జు కావడం గమనార్హం. గాయపడిన వారిని సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో రహదారులు ఆదివారం నెత్తురోడాయి.
నల్గొండ జిల్లా పెద్దకాపర్తి దగ్గర కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్షయా ట్రావెల్స్ బస్సు.. స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
►ALSO READ | బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. కరీంనగర్ జిల్లాలో యువకుడు మృతి..!
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. మృతదేహాలను నల్గొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన కుటుంబం ఏపీలోని కాకినాడగా చెందిందిగా పోలీసులు గుర్తించారు.
