అలీ ఖమేనీ అంత్యక్రియల్లో.. కనిపించని మోజ్తాబా ఖమేనీ 

అలీ ఖమేనీ అంత్యక్రియల్లో.. కనిపించని మోజ్తాబా ఖమేనీ 

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరయ్యారు. అయితే ఆయన వారసుడు, కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన ఆచూకీపై  అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

టెహ్రాన్ లో ఆదివారం జరిగిన అలీ ఖమేనీ అంత్యక్రియలకు అలీ ఖమేనీ కుమారులలో ఇద్దరు ముస్తఫా, మెయ్‌సామ్, మసూద్ మాత్రమే కనిపించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, ఐఆర్‌జీసీ చీఫ్ అహ్మద్ వాహిది కూడా హాజరయినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం మయింది. మసూద్ ఖమేనీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి.

మార్చిలో తన తండ్రి మరణం తర్వాత సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ బయటి ప్రపంచానికి కనిపించలేదు. ఇటీవల తన భార్య జహ్రా హదాద్-అడెల్ సంస్మరణ సభకు కూడా ఆయన హాజరు కాలేదు. 

►ALSO READ | దేశానికి ప్రెసిడెంట్ అయినా.. సిట్యుయేషన్ ఒక్కటే! నెటిజన్లను ఫిదా చేస్తున్న కొరియా అధ్యక్షుడి వీడియో!

ఫిబ్రవరి 28న ఖమేనీ కుటుంబ నివాసంపై జరిగిన ఇజ్రాయెల్, అమెరికా దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రెండు కాళ్లకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయన ప్రజల ముందుకు రావడం లేదని సమాచారం. అయితే భద్రతా కారణాల వల్లే మొజ్తబా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఆయనపై మరో దాడి జరిగే అవకాశం ఉందనే హెచ్చరికల క్రమంలో ప్రజల్లో కనిపించవద్దని భద్రతా సిబ్బంది సూచించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. 

మిగతా కార్యక్రమాలకు హాజరవుతారా?

అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తాబా ఇప్పటివరకు ఏ కార్యక్రమాలకు హాజరు కానప్పటికీ, అయన అంత్యక్రియల చివరి దశల్లో పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. ఐఆర్‌జిసి అధికారుల ప్రకారం..కనీసం వేడుకల్లో కొన్ని భాగాలకైనా హాజరు కావాలనే కోరికను మోజ్తాబా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మషద్‌లో జరిగే ఖననానికి హాజరై, తన తండ్రి కోసం స్వయంగా ప్రార్థనలు చేయాలని మొజ్తాబా ఖమేనీ భావిస్తున్నారని ఇరాన్ వర్గాల సమాచారం.