ఎన్డీయేలో చేరాలంటూ కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఆహ్వానాన్ని తిరస్కరించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో చేతులు కలపాలని అభిజీత్ ను ఆహ్వానించారు రామ్ దాస్. ఇందుకు బదులుగా నెల రోజుల క్రితం నేను మీ దృష్టిలో దేశద్రోహిని కదా అంటూ కౌంటర్ ఇచ్చారు అభిజీత్.
జంతర్ మంతర్ నిరసనల విజయం తర్వాత దేశవ్యాప్తంగా పాఠశాలల శిథిలావస్థను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రస్తుతం 'స్కూల్ టీఖ్ కరో' క్యాంపెయిన్ ప్రారంభించారు అభిజీత్ దీప్కే.
ఈ ప్రచారంలో భాగంగా, అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుధ్య సౌకర్యాలు, కంప్యూటర్ల కొరత, అలాగే తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం వంటి లోపాలను గుర్తించండి సీజేపీ. సీజేపీ క్యాంపెయిన్ కు పాఠశాల విద్యార్థులు కూడా మద్దతు పలికారు.
