హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది టీజీఎస్ఆర్టీసీ. ప్రగతి నగర్ కమాన్ నుంచి వేవ్ రాక్ వరకు కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రగతి నగర్ నుంచి ORR మీదుగా వేవ్ రాక్ వరకు ఈ బస్సు నడపనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ బస్సు ఉదయం, సాయంత్రం బాచుపల్లి, మల్లంపేట, ఐటీ కారిడార్ ల మీదుగా నడుస్తుందని తెలిపారు అధికారులు. ఈ సర్వీస్ తో ప్రతిరోజూ వేవ్ రాక్ వైపు వెళ్లేవారికి ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు బాచుపల్లి క్రాస్ రోడ్, మల్లంపేట్ ORR ఎగ్జిట్ 4A, ఎగ్జిట్ 1, సైయెంట్ సిగ్నల్, ఐసీఐసీఐ సిగ్నల్ మీదుగా ప్రయాణించనున్నాయి.
ఆర్టీసీ అధికారుల ప్రకారం, ప్రగతి నగర్ కమాన్ నుండి ఉదయం సర్వీసులు 7.45 గంటలకు, 8.15 గంటలకు, 9.15 గంటలకు మరియు 10.15 గంటలకు నడుస్తాయి. వేవ్‌రాక్ నుండి తిరుగు ప్రయాణ సర్వీసులు సాయంత్రం 4.15 గంటలకు, 5.15 గంటలకు మరియు 6.45 గంటలకు నడుస్తాయి.
ఈ సర్వీస్ సిటీ నార్త్ వెస్ట్రన్ భాగంలోని ప్రాంతాలకు, వేవ్ రాక్ ఐటీ కారిడార్ మధ్య ప్రయాణించేవారికి ప్రయోజనంతో పాటు మరింత సౌకర్యవంతంగా ఎకో ఫ్రెండ్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు దోహదపడుతుందని తెలిపారు అధికారులు.
